Barber-jailed-for-molesting-hearing-impaired-boy-in-Dubai

భారతీయుడికి దేశబహిష్కరణ..కారణం ఇదే..

దుబాయ్: పర్యటక వీసాపై యూఏఈలోని దుబాయ్‌ నగరం వెళ్లిన ఓ భారతీయుడు నేరానికి పాల్పడ్డాడు. ఓ బార్బర్ షాప్‌ను నడిపించాడు. హేయిర్ కటింగ్ కోసం షాప్‌కు వచ్చిన ఓ బాలుడిని లైంగికంగా వేధించాడు. బాలుడిని అసభ్యకరంగా తాకాడు. ఈ క్రమంలో బాలుడికి హాని కలిగించాడు. గతేడాది సెప్టెంబర్ 26న ఈ ఘటన జరిగింది. నిందితుడిపై బాలుడి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణ మొదలైంది. తాను నేరానికి పాల్పడలేదని నిందితుడు మొదట్లో బుకాయించాడు. కానీ కోర్టులో నేరం రుజువైంది. దోషికి మూడు నెలల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం.. శిక్షాకాలం పూర్తైన అనంతరం దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించింది. దోషి భారత్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి అని పోలీసులు తెలిపారు.