:: Welcome to NRI - Article ::

గ్రహణం నాడు అతీంద్రియ పరిణామాలు.. జాగ్రత్త

వాషింగ్టన్: ‘ఆగస్టు 21న సంభవించే సూర్యగ్రహణం సందర్భంగా ప్రపంచంలో కొన్ని అతీంద్రియ పరిణామాలు చేసుకునే అవకాశం ఉంది. ఆరోజు ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలి’ అంటూ దక్షిణ కరోలైనా రాష్ట్ర అత్యవసర నిర్వహణ విభాగం(ఎస్సీఈఎండీ) పౌరులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రపంచం సాంకేతికంగా ముందుకు దూసుకుపోతున్నా అమెరికాలాంటి దేశాన్నీ మూఢనమ్మకాలు వెంటాడుతున్నాయి. సూర్యగ్రహణం సంభవించే రోజున ‘బల్లి మనిషి’ ఎదురుకావచ్చని తెలిపింది. ఇది ప్రజలను ఆటపట్టించడానికి చేస్తున్న ప్రకటన కాదని ఎస్సీఈఎండీ పేర్కొంది. దీనికితోడు రాష్ట్రంలో గ్రహణం కనిపించే ప్రాంతాల మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా లీ, సమ్టర్ కౌంటీ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. గతంలో ఈ విధంగా ‘బల్లి మనిషి’ కనిపించిన ఉదంతాన్ని కూడా గుర్తుచేసింది. 1988లో క్రిస్టోఫర్ డేవిడ్ అనే వ్యక్తి బల్లి మనిషిని చూశాడని చెబుతారు. చింతనిప్పుల్లాంటి కళ్లతో భూతం కనిపించిదని అతను పేర్కొన్నాడు. అప్పట్లో ఈ వార్త అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. సూర్యగ్రహణం రోజు ‘బల్లి మనిషి’ నుంచి రక్షణకు నల్లని టీ షర్టులుధరించాలనే ప్రచారం కూడా విపరీతంగా జరుగుతోంది.

 

Loading...