:: Welcome to NRI - Article ::

మహిళా రెజ్లర్ కన్నుమూత.. అభిమానుల్లో తీవ్రవిషాదం

న్యూయార్క్: ప్రముఖ మహిళా బాడీబిల్డర్, ప్రొఫెషనల్ రెజ్లర్ నికోలే బాస్ అకస్మాత్తుగా మరణించారు. డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమాలను టీవీల్లో వీక్షించేవారికి ఏమాత్రం పరిచయం చేయవలసిన అవసరంలేని నికోలే న్యూయార్క్‌లోని ఓ హాస్పిటల్లో గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని భర్త క్రిష్టీనే మార్రోనే ఫేస్‌బుక్ ద్వారా ఆమె అభిమానులకు తెలియజేశారు. కొద్దిరోజుల క్రితం నికోలే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, హాస్పిటల్లో చేర్పించామని, ఆమెను రక్షించేందుకు వైద్యులు తీవ్రమైన ప్రయత్నాలు చేశారని, కానీ ఫలితం దక్కలేదని తన ఆవేదనను తెలియజేశారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమీటి, ఎలా అనే కారణాలు అడగవద్దని ఆయన కోరారు. నాలుగు రోజుల నుంచి ఆమె మరణంపై పలు చానెళ్లలో వార్తలు వెలువడ్డాయి. కానీ అధికారికంగా నిర్ధారించలేదు. ఈ రోజు ఆమె భర్త మార్రోనే వెల్లడించడంతో ఆమె ఇక లేరనే వార్త బయటకు తెలిసింది. దీంతో ఆమె అభిమానులు విషాదానికి గురవుతున్నారు.