Authorities-to-increase-fee-for-work-permits

కువైట్ ఉద్యోగాలు.. రేటు పెరిగాయి

కువైట్:స్వదేశంలో కాకుండా ఏ దేశంలో ఉద్యోగం చేయాలన్నా వర్క్ పర్మిట్ ఉండాల్సిందే. దీనికి కొంత ఫీజు ఉంటుంది. కువైట్ ప్రభుత్వం ఈ ఫీజుపెంచనున్నట్లు సమాచారం. ఇక నుంచి 20దీనార్ల(సుమారు రూ.5000) నుంచి 400దీనార్ల(సుమారు రూ.లక్ష) వరకు జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలకు కొత్త వర్క్ పర్మిట్‌ కోసం, రీన్యూవల్, ట్రాన్స్‌ఫర్ కోసం పెట్టే ఖర్చు పెరగనుంది. ఇప్పటివరకు ఏడాదికి 10 దీనార్లుగా ఉన్న ఈ ఫీజును 20దీనార్లకు కువైట్ పెంచుతున్నట్లు తెలిసింది. అలాగే తొలి సారి తీసుకునే పర్మిట్ ఫీజు 60 నుంచి 70దీనార్లకు చేయనున్నారు. వర్క్ పర్మిట్ రీన్యూవల్, బదిలీ ఫీజును తొలి సారి 100, రెండో ఏడు 200, మూడో ఏడాది 300, నాలుగు ఆ తర్వాతి సంవత్సరాలకు 400 దీనార్లకు పెరగనున్నట్లు అధికారులు చెప్తున్నారు.