Assistance-for-Indian-women-deserted-by-NRI-husbands

ఎన్నారైలు వదిలేసిన భార్యకు 4 వేల డాలర్ల సహాయం

న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ కీలకమైన ఓ విషయాన్ని వెల్లడించింది. ఎన్నారై భర్తలు వదిలేసిన బాధిత మహిళలకు న్యాయ, ఆర్థిక సహాయాన్ని పెంచాలని ప్రభుత్వం పెంచింది. భార్యలను వదిలేసి 13 దేశాలలో ఉంటున్న నిందిత భర్తల నుంచి బాధిత మహిళలకు న్యాయ చేసేందుకు కేటాయిస్తున్న ఆర్థిక సహాయాన్ని 4 వేల డాలర్లకు పెంచింది. గతంలో ఒక్కో కేసుకు కేటాయించిన 3 వేల డాలర్ల మొత్తాన్ని 4 వేల డాలర్లకు పెంచారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్(ఐసీడబ్ల్యూఎఫ్) 2017 సెప్టెంబర్ మార్గదర్శకాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. రాజ్యసభలోని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖిత పూర్వక సమాధానమిచ్చిన ఆయన ఈ వివరాలను తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో వివిధ దేశాలలో బాధితులుగా ఉన్న మొత్తం 43 మంది మహిళలకు సహాయం అందించామని ఆయన వెల్లడించారు.