:: Welcome to NRI - Article ::

ఎక్కువ డబ్బులొచ్చే పని చూపిస్తానని మహిళను నమ్మించి..

దుబాయ్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ బంగ్లాదేశీయుడు నేరస్తుడిగా మారాడు. ఓ కంపెనీలో తక్కువ జీవితానికి పనిచేస్తూ ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళపై అతడి చూపు పడింది. ‘ నీకంటే తక్కువ సమయం పనిచేస్తున్న కొందరు మహిళలు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. నాతోపాటు బయటకు వస్తే ఎక్కువ డబ్బులు వచ్చే పనిని చూసిస్తాను’ అంటూ మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మహిళ తప్పించుకుని బయటకు వచ్చింది. నిందితుడు ఎవ్వరికీ తెలియకుండా ఆమెను ఓ ఫ్లాట్‌లో బంధించాడు. వ్యభిచారం చేయాలని, డబ్బులు మాత్రం తానే తీసుకుంటానని, తన నిబంధనలకు ఒప్పుకుంటే కొంత డబ్బు చెల్లిస్తానని ఇబ్బందులకు గురిచేశాడు. వ్యభిచారం చేసేందుకు ఒప్పుకోకపోవడంతో 49 వేల రూపాయలకు ఓ వ్యక్తికి అమ్మేందుకు ప్రయత్నించాడు. కారులో తీసుకెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం ప్రకారం సోదాలు నిర్వహించిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకి తరలించారు. 

Loading...