Asian-man-gets-3-months-jail-for-illicit-sex-with-Arab-woman

మసాజ్ కోసం వెళ్లాడు.. కానీ జరిగింది ఇదీ..

అజ్మాన్, యూఏఈ : ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన యువకుడికి మూడు నెలల జైలుశిక్షపడింది. ఆసియాలోని ఓ దేశానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఉపాధి కోసం యూఏఈలోని అజ్మాన్ వెళ్లాడు. స్థానికంగా నివసిస్తున్న 39 ఏళ్ల అరబ్ మహిళతో లైంగికంగా కలిశాడు. మసాజ్ కోసం మహిళ నివాసానికి వెళ్లిన యువకుడు 200 దిర్హమ్స్ మహిళకు చెల్లించాడు. కానీ ఇద్దరూ లైంగికంగా కలిశారు. అనంతరం మసాజ్ చెయ్యాలని కోరిన యువకుడిని అదనంగా డబ్బులు కావాలని మహిళ అడిగింది. అదనంగా డబ్బులు చెల్లిస్తేనే మసాజ్ చేస్తానని చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహిళ సెల్‌ఫోన్ తీసుకుని యువకుడు బయటకు వెళ్లాడు. తన డబ్బులు తిరిగిస్తేనే సెల్‌ఫోన్ ఇస్తానంటూ ఆమెకు చెప్పాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ ముగిసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు మూడు నెలల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం.. శిక్షాకాలం ముగిసిన అనంతరం స్వదేశానికి పంపించివేయాలని ఆదేశించింది. కానీ మహిళ వాదన మరోలావుంది. తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాని తెలిసిన యువకుడు తనకు సహాయం చేస్తానంటూ దగ్గరయ్యాడని మహిళ చెప్పింది.