దుబాయ్: ఒక ఎయిర్‌పోర్టులో నిలిచివున్న ఎమిరేట్స్‌కు చెందిన ఈ విమానం వజ్రాల ధగధగల్లో మెరిసిపోతోంది కదూ... ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేరుతో ట్విటర్లో ప్రత్యక్షమైన ఈ విమానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ చిత్రాన్ని సారా షకీల్ అనే ఆర్టిస్ట్ రూపొందించారు. ఆమె ఇలాంటి ఎన్నో చిత్రాలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.