:: Welcome to NRI - Article ::

తెలుగువారిని ఆదుకున్న ఏపీ‌ఎన్‌ఆర్టీకి సీఎస్ ప్రశంసలు

హ్యూస్టన్, టెక్సాస్: అమెరికాలోని హ్యుస్టన్‌లో హరికేన్ హార్వే బాధితులను ఆదుకోవడంలో ఏపీ‌ఎన్‌‌ఆర్టీ బృంధానికి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ ఏపీఎన్‌ఆర్టీ సేవలను మెచ్చుకున్నారు. ఈ మేరకు ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరును పిలిపించి ఆయన మాట్లాడారు. సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో బృంద సేవలను అభినందించారు. ఇక ముందు ఏపీఎన్‌ఆర్టీ ఇలానే సాయం అందించాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ఏపీఎన్‌‌ఆర్టీ మీడియా కో-ఆర్డినేటర్ సాగర్ దొడ్డపునేని మీడియాకు తెలిపారు.  
 
ఫ్లోరిడాలో వచ్చిన హరికేన్ బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు అసోసియేషన్( ఏపీఎన్ఆర్టీ) సేవా సంస్థ ముందుగా చొరవచూపింది. ఈ మేరకు ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరు ఎప్పటికప్పుడు సహాయ శిబిరాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. కానీ హరికేన్ ఇర్మా అనుకున్నంత ప్రభావం చూపలేదు. అదృష్టవశాత్తు తెలుగు వారంతా క్షేమంగానే బయటపడ్డారు. అయినా ఏపీఎన్‌ఆర్టీ అప్రమత్తం కావడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్‌ఆర్టీ సంస్థ సేవలను మెచ్చుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్టీ చీఫ్ కో-ఆర్డినేటర్ బుచ్చి రాంప్రసాద్, రీజినల్ అడ్మినిస్ట్రేటర్లు మాధవి మేడి, గుమ్మడాపు పాపారావు, జాక్సన్ విల్లి ప్లోరిడా కోఆర్డినేటర్, మీడియా కో-ఆర్డినేటర్ సాగర్ దొడ్డపునేనిలు పాల్గొన్నారు.