:: Welcome to NRI - Article ::

అమెరికా వ్యతిరేక ర్యాలీలు..

వాషింగ్టన్: అమెరికాకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా వ్యాప్తంగా ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉత్తరకొరియా అధికారిక మీడియా ఒక ఫోటోను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అమెరికాపై వెల్లువెత్తుతున్న నిరసనకు ఇదే నిదర్శనమంటూ పేర్కొంది. ఇటీవల అంక్షల పేరుతో అమెరికా తమ దేశాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఉత్తరకొరియా మీడియా ఆరోపించింది.

అదే సమయంలో ఉత్తరకొరియా ప్రజల్లో కూడా అమెరికాపై వ్యతిరేకంగా తీవ్రంగా ఉందని చెబుతోంది. యుద్ధం వచ్చిన ప్రజలు దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతోంది. చైనా నుంచి ఆయిల్ దిగుమతుల్ని, తమ దేశ టెక్స్‌టైల్ ఎగుమతుల్ని నిలిపేసి అమెరికా పెద్ద తప్పే చేసిందని ఆరోపించింది. అయితే తమ దేశ ప్రజలు ఏమాత్రం దైర్యం కోల్పోలేదని తెలిపింది. అంక్షలు విధిస్తూపోతే ప్రజలు మరింత రెచ్చిపోతారని చెబుతోంది.