american-jailed-for-attack-on-indian-origin-person

భారత సంతతి వ్యక్తిపై దాడి చేసిన అమెరికన్‌కు జైలుశిక్ష

న్యూయార్క్: భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తిపై క్రూరంగా దాడి చేసిన ఓ అమెరికన్‌కు 15 నెలల జైలుశిక్షపడింది. గతేడాది డిసెంబర్‌లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన 53 ఏళ్ల స్వర్ణ సింగ్‌ అనే వ్యక్తిపై రోరీ బెనన్స్ అనే వ్యక్తి దాడి చేశాడు. సింగ్ నడుపుతున్న టాక్సీలో ప్రయాణిస్తున్న బెనన్స్ దాడి చేశాడు. ముందుగా దుస్తులతో ఊపిరాడకుండా చేద్దామనుకున్నాడు. కారు దిగి పారిపోతున్న సింగ్‌ను వెంబడించిన బెనన్స్ ఓ సుత్తితో క్రూరంగా దాడి చేశాడు. తలపై దారుణంగా కొట్టాడు. దీంతో సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. కపాలానికి తీవ్రమైన గాయాలయ్యాయి. దాదాపు సంవత్సరం తర్వాత బెనన్స్ దోషిగా తేలడంతో 15 నెలల జైలుశిక్ష విధిస్తున్నామని సియాటెల్‌లోని కోర్టు తీర్పును వెల్లడించింది.