Trump-about-US-sanctions-on-India

భారత్‌పై అమెరికా ఆంక్షలు..?

ఆంధ్రజ్యోతి, 12-10-2018:ష్యాతో ఎస్‌-400 వైమానిక రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నందుకు భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించనుందా? ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు ఆ దిశగా పరోక్ష సంకేతాలు ఇస్తున్నాయి. భారత్‌కు త్వరలోనే తెలిసి వస్తుందంటూ ఆయన బుధవారం వైట్‌హౌస్‌లో నర్మగర్భంగా అన్నారు. ఆంక్షల ద్వారా అమెరికా శత్రువులను ఎదుర్కొనే చట్టం ‘క్యాట్సా’ ద్వారా ఇరాన్‌, ఉత్తర కొరియా, రష్యాలపై అమెరికా ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది. రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌పైనా ఆంక్షలు ఉంటాయా? అని విలేకరులు ప్రశ్నంచగా.. ‘అవేంటో భారత్‌ తెలుసుకుంటుంది. మీరు అనుకున్నంత సమయం కూడా పట్టదు. ఆ దేశానికి త్వరలోనే తెలిసొస్తుంది. మీరే చూస్తారు’ అని ట్రంప్‌ బదులిచ్చారు. మరోవైపు అమెరికా ఆంక్షలకు భయపడేది లేదని, భారత్‌తో మరిన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది. ఎస్‌-400 క్షిపణుల కొనుగోలును రెండు దేశాల మధ్య అతిపెద్ద ఒప్పందంగా భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుదషెవ్‌ అభివర్ణించారు.