America-is-prepared-for-military-action-in-Syria-says-haley

మిలిటరీ చర్యకు సిద్ధం: అమెరికా

న్యూయార్క్: భారత సంతతి మహిళ, ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రధాన రాయబారి నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరియాలో కొనసాగుతున్న ఆందోళనకర కాల్పులు, రక్తపాతాన్ని నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని పేర్కొన్న ఆమె.. సిరియాలో సైనిక చర్య తీసుకుంటామని, పరిస్థితులను చక్కదిద్దుతామని, చర్యకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సిరియాలో కాల్పులు నిలిపివేయాలంటూ ఐరాస భద్రతా మండలిలో ఫిబ్రవరి 24న ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేయడంలో ఐరాస విఫలమైందని, అందుకే తాము సైనిక చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హేలీ హెచ్చరించారు. ఇదిలావుండగా ఫిబ్రవరి 18 నుంచి జరుగుతున్న దాడుల కారణంగా 1160 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. వీరిలో అమాయక చిన్నారులు అనేకమంది ఉండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.