america-doing-this-

అత్యాధునిక యుద్ధవిమానాలను మోహరించి..

వాషింగ్టన్: అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలు బీ2 స్పిరిట్ బాంబర్స్ గువామ్‌లో మోహరించాయి. మొత్తం మూడు బీ2 విమానాలతోపాటు రెండు వందల మంది సైనికులు కూడా గువామ్‌లో కాలుమోపారని అమెరికా సైనికాధికారులు తెలిపారు. అయితే దక్షిణకొరియాలో జరగనున్న ఒలంపిక్ క్రీడలు ప్రశాంతంగా జరిగేలాని ఆ దేశం ఉత్తరకొరియాతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒలంపిక్ క్రీడలు ప్రశాంతంగా జరగాలని చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా ద్వీప ప్రాంతం గువామ్‌లో యుద్ధ విమానాలు మోహరించడం ఆందోళన కలిగిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. రహస్యంగా ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ రూపొందిస్తోందని వార్తలు వస్తున్నాయని కూడా తెలిపింది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని అంతర్జాతీయ మీడియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.