Alarming-increase-in-Ethiopian-suicide-cases-in-UAE

యూఏఈలో ఆత్మహత్యల ఆందోళన

షార్జా: ఉపాధి కోసం, డబ్బు సంపాదించడం కోసం అనేకమంది లక్ష్యంగా ఎంచుకుంటున్న గల్ఫ్ దేశం యూఏఈలో ఆత్మహత్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇథియోపియాకు చెందినవారు అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుబాయ్ నగరంలోని ఇథియోపియన్ కాన్సులేట్ తెలిపింది. షార్జా, అజ్మాన్, రస్ అల్ ఖైమా ప్రాంతాలలో ఆత్మహత్యలు నమోదయ్యాయని, 2016-17 మధ్యకాలంలో ఇథియోపియాకు చెందిన ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇథియోపియాకు చెందిన 2 లక్షల మంది కార్మికులకు యూఏఈలో పనిచేస్తున్నారని, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం వెల్లడైందని ఇథియోపియన్ కాన్సులేట్ జనరల్ ఇబెల్టాల్ ఏమిరో అలేము తెలిపారు. ఆత్మహత్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతంగా ప్రాణాలు తీసుకొవద్దని, ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.