:: Welcome to NRI - Article ::

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రవాస మహిళ అదృశ్యం

హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ మేరకు ఆ మహిళ భర్త ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అభినవ్‌ కుమార్‌, కుష్‌బూ దంప తులు దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఆ దంపతులిద్దరు కలసి కోల్‌కత్తా వెళ్లాల్సి ఉంది. కాగా, కోల్‌కత్తా వెళ్లే విమానానికి ఇంకా సమయం ఉండటంతో కుష్‌బూ ఎయిర్‌పోర్టులోని షాపింగ్‌ దుకాణాల్లో ఏవో వస్తువులు కొనడానికి వెళ్లింది. ఆ తరువాత ఎంతకూ తిరిగిరా లేదు. ఫోన్‌ చేయగా స్విచ్‌డ్‌ ఆఫ్‌ అని వస్తోంది. మరికొంత సమయం వేచి చూసి ఎయిర్‌పోర్టులోని షాపుల్లో చూసినా ఫలితం లేకపోవడంతో ఆమె భర్త అభినవ్‌ కుమార్‌ ఆర్జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. 


శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రవాస మహిళ అదృశ్యం