after-marriage-happened-this--

పెళ్లయిన కొద్ది క్షణాలకే పెళ్లి కుమార్తె ‘దిమ్మ’తిరిగింది!

న్యూయార్క్: ఇదేంటి అని టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? ఎస్ మీరు వింటున్నది నిజమే. కొత్తగా పెళ్లయిన జంట వివాహ తంతు అనంతరం ఇద్దరూ(పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె) కలిసి కేక్ కట్ చేశారు.. ఒకరికొకరు తినిపించుకున్నారు. అంతటితో ఆగుంటే సరిపోయేదే.. కానీ పోటాపోటీగా కేక్ ఒకరికొకరు ముఖానికి పూసుకున్నారు. ఈ క్రమంలో నవ వధువు ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలేం జరిగిందో తెలియక తథేకంగా ఆ పెళ్లి కుమార్తె వైపే చూడసాగారు. తిన్నగా కోలుకున్నాక నవ వరుడే ఆమెను పైకి లేపాడు. వరుడి సాయంతో పైకి లేచిన వధువు దిమ్మదిరిగినట్లుగా అటూ.. ఇటూ నడిచి నిమిషం తర్వాత కోలుకుంది.

కాగా.. అంత వరకూ ఏ ఒక్కరూ ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు.. అందరూ తమ ఫోన్ కెమెరాలకు పనిచెప్పారే గానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం విశేషం. అంతేకాదు కార్యక్రమానికి వచ్చినవాళ్లంతా నవ్వుల వర్షం కురిపించడం గమనార్హం. ఆ తర్వాత మళ్లీ కేక్ ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చిన ఆమె రెండు చిన్నపాటి టవల్స్ తీసుకొని ఇద్దరూ ముఖం తుడుచుకొని కిస్ చేసుకున్నారు. అనంతరం యథావిధిగా మిత్రులతో కలిసి కొత్త జంట పార్టీలో నిమగ్నమైంది. ఈ ఘటన న్యూయార్క్‌లోని ఎల్మిరాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి..!