:: Welcome to NRI - Article ::

బాలుడిపై అత్యాచారం, హత్య..అనంతరం చేసిన పనిది

అబుధాబి: బాలుడిపై అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేసిన దుండగుడు మానసికంగా, భౌతికంగా ధృడంగా ఉన్నాడని తేలింది. కోర్టు విచారణ కొనసాగేందుకు మార్గం ఏర్పడింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళ్తే.. యూఏఈలోని అబుధాబి నగరంలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన బాలుడు అదృశ్యమయ్యాడు. కొద్దిరోజుల తర్వాత బాలుడి మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు జరిపిన అధికారులు సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ నెలలో జరిగింది. విచారణ కోసం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదించిన నిందితుడి తరపు న్యాయవాది.. నిందితుడి మానసిక, భౌతిక స్థితి సరిగాలేనందునే ఈ చర్యకు పాల్పడ్డాడని, కోర్టు విచారణకు కూడా సహకరించే పరిస్థితిలేదని వాదించాడు. ఇప్పటికి రెండుసార్లు జరిగిన విచారణల్లోనూ ఇదేవిషయాన్ని చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాడు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిందితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తేల్చారు. నివేదికను న్యాయస్థానానికి అందించారు. ఇదే విషయాన్ని వెల్లడించిన న్యాయస్థానం కేసు విచారణ ప్రారంభించనున్నామని బుధవారం తెలిపింది. కోర్టుకు అబద్ధం చెప్పిన నిందితుడిపై కేసు నమోదు చేశామని, అబుధాబి నగర డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మఖ్తూం అల్ షరీఫీ తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన నిందితుడు బాలుడిపై అత్యాచారం జరిపి హత్య చేశాడని గతంలోనే ఒప్పుకున్నాడని, ప్రస్తుతం అబద్దమాడి మరోసారి పట్టుబడ్డాడని ఆయన తెలిపారు.