a-new-missile-attack-

సిరియాపై దాడికి మొదటిసారిగా..

వాషింగ్టన్: అమెరికా మొట్టమొదటిసారిగా సరికొత్త ఆయుధాన్ని సిరియాపై ప్రయోగించింది. మునుపెన్నడూ చూడని విధంగా విధ్వంసం సృష్టించే స్టిల్త్ క్రూయిజ్ మిస్సైల్‌ను సిరియాపై ప్రయోగించింది. ఈ మిస్సైల్ ఆరు వందల మైళ్ల దూరం నుంచే లక్ష్యాన్ని చేధించగలదని అమెరికా సైనికాధికారులు తెలిపారు. 2014లోనే ఈ మిస్సైల్‌ను రక్షణ రంగంలోకి తీసుకోచ్చామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎన్నడూ మిస్సైల్‌తో దాడులు చేయలేదన్నారు.

ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే ఈ మిస్సైల్‌ను లోక్‌హీడ్ మార్టిన్ సంస్థ రూపొందించింది. ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సిస్టమ్‌ సహయంతో మిస్సైల్ లక్ష్యాలను చేధిస్తుందని సైనికాధికారులు తెలిపారు. అంతేకాకుండా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్‌లు కూడా మిస్సైల్ కలిగి ఉందన్నారు. పిన్‌పాయింట్‌లో ఉండే లక్ష్యాలను కూడా మిస్సైల్ చేధించగలదన్నారు. సిరియాలో జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలను కూడా అధికారులు విడుదల చేశారు.