A-huge-hit-with-tourists

బోటును డీకొట్టిన తిమింగలం..

వాషింగ్టన్: బోటులో సముద్ర ప్రయాణం చేస్తున్న వారికి ఓ భారీ తిమింగలం షాకిచ్చింది. హఠాత్తుగా బోటు ముందు ప్రత్యక్షమయింది. తన తోకతో బోటును ఢీకొట్టింది. సముద్ర ప్రయాణం చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వసాధారణమేనని అధికారులు చెబుతున్నారు. అయితే బోటును లక్ష్యంగా చేసుకుని ఓ తిమింగలం ఇలా చేయడం మాత్రం తాము ఇప్పటివరకు చూడలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

డేవిడ్ మాడ్లర్ అనే వ్యక్తి మాట్లాడుతూ తాము బోటులో బేరిర్ దీవికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందన్నాడు. తిమింగలం రాకకు ముందు సముద్రం ప్రశాంతంగానే ఉందన్నాడు. తిమింగలం రాకతో కొద్దిసేపటికే సముద్రంలో అలజడి మొదలయిందని అతడు తెలిపాడు. తిమింగలం దాదాపు తమ బోటు కంటే రెండింతలు పెద్దగా ఉందన్నాడు. తిమింగలం తోక ఒక్కటే 15 మీటర్ల పొడవుందని డేవిడ్ తెలిపాడు. బోటును తిమింగలం ఢీకొట్టినా కూడా ఎటువంటి ప్రమాదం జరగపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని డేవిడ్ తెలిపాడు.