a-big-threat-with-this-bacteria-

చర్మాన్ని తినేస్తున్న బ్యాక్టీరియా..

ఆస్ట్రేలియా: చర్మాన్ని తినేస్తోన్న ఒకరకమైన బ్యాక్టీరియాను ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు ఆస్ట్రేలియా మెడికల్ జరనల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త యేడాదిలో 30 మందికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అన్ని వయసుల వారికి ఈ బ్యాక్టీరియా సోకుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులకు ఎక్కువ ప్రమాదం కలిగించే అవకాశం ఉందన్నారు.

ఈశాన్య ఆస్ట్రేలియా, విక్టోరియాల్లోని పలు ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు తెలిపారు. "బ్రూలీ యూక్లేర్" అని పిలిచే ఈ బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టేందుకు సరైన మందులు కూడా అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. జాగ్రత్త పడటం ఒక్కటే మార్గమని వారు సూచిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 275 మందిలో ఈ లక్షణాలు గుర్తిస్తే, కేవలం 2018లో 30 మందికి బ్యాక్టీరియా సోకడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. అవసరమైతే మెడికల్ ఎమర్జెన్సీ విధించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు.