4-year-old-girl-dies-after-falling-from-apartment-window-

న్యూయార్క్‌లో విషాదం.. అపార్ట్‌మెంట్ కిటికీ లోంచి పడి 4ఏళ్ల పాప మృతి

న్యూయార్క్: భార్యాభర్తలిద్దరూ తమ నాలుగేళ్ల పాపను నిద్రబుచ్చి.. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. నవ్వుతూ, తుళ్లుతూ సరదాగా గడుపుతున్నారు. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే నిద్రపోయిందనుకున్న వారి పాపకు మెలకువ వచ్చింది. నిద్ర లేచిన ఆ పాప తన గదిలోంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. కుదరలేదు. దాంతో కిటికీ తెరవడానికి ప్రయత్నించింది. అది తెరుచుకుంది. అక్కడి నుంచి బయటకు చూస్తూ ముందుకొచ్చింది. పట్టుతప్పి కిందపడిపోయింది. రెండో అంతస్తు నుంచి పడటంతో ఆమె శరీరం చాలా దెబ్బతింది. ఏదో చప్పుడవడంతో ఉలిక్కిపడ్డ భార్యాభర్తలిద్దరూ హడావుడిగా బయటకొచ్చారు. కిటికీ గుండా కింద పడ్డ కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండెలాగిపోయాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ పాప చనిపోయింది. ఆ వార్త విన్న తల్లిదండ్రులను విషాదం కమ్మేసింది. హృదయవిదారకమైన ఈ ఘటన న్యూయార్క్‌లో శనివారం జరిగింది.