300000-illegally-obtained-Kuwaiti-citizenship-says-kuwait-MP

అసలు విషయాన్ని బయటపెట్టిన కువైట్ ఎంపీ

కువైట్: గల్ఫ్ దేశం కువైట్‌కు చెందిన ఓ ఎంపీ సంచలన విషయాన్ని వెల్లడించారు. లక్షలాది మంది విదేశీయులు నకిలీ పత్రాలతో కువైట్ పౌరసత్వాన్ని పొందారని తెలిపారు. దేశ జనాబా 1.3 మిలియన్లు కాగా అందులో దాదాపు 3 లక్షల మంది విదేశీయులు అక్రమంగా కువైట్ పౌరసత్వాన్ని పొందారని ఎంపీ సఫా అల్ హషీమ్ అన్నారు. అక్రమంగా పౌరసత్వాన్ని పొందినవారిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న అంతర్గత వ్యవహారాల శాఖను అభినందిస్తున్నానని ఆమె అన్నారు. అధికారుల తనిఖీలో దాదాపు 3 లక్షల మంది అక్రమంగా పౌరసత్వాన్ని పొందినట్లు గుర్తించామని, తగిన చర్యలు తీసుకోనున్నామని ఆమె అన్నారు. అనేకమంది కువైట్ పౌరులుగా మారడం, ముఖ్యంగా సిరియన్లు భారీ సంఖ్యలో ఉండడంపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని కువైట్ డైలీ పేర్కొంది.