25-years-in-jail-

విదేశీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల జైలు

దుబాయ్ : ఓ విదేశీ విద్యార్థినిని విల్లాకు పిలిపించి, ఆమెపై అత్యాచారం జరిపిన 24 ఏళ్ల దుబాయ్ యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ దుబాయ్ కోర్టు తీర్పునిచ్చింది. దుబాయ్ దేశానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ఈజిప్టు దేశానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థినిని తన విల్లాకు పిలిపించి, బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ ఏడాది జూన్ 24వతేదీన జరిగిన ఈ ఘటనలో దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని దుబాయ్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారించిన దుబాయ్ కోర్టు దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.