:: Welcome to NRI - Article ::

25 శాతం డిస్కౌంట్.. దుబాయి ఎయిర్‌పోర్ట్ వినూత్న ప్ర‌యోగం

దుబాయిః విమాన ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌. విహార‌యాత్ర‌లకో, హ‌నీమూన్‌కో విదేశాల‌కు టూర్ల‌కు వెళ్తున్నారా..? దుబాయి మీదుగా వెళ్తే క‌నుక బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఎంచ‌క్కా వినియోగించుకోవ‌చ్చు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 25 శాతం డిస్కౌంట్ పొందుతూ వివిధ ర‌కాల స‌ర్వీసుల‌ను పొందొచ్చు. దుబాయి ఎయిర్‌పోర్ట్ ఈ అరుదైన అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఎమిరేట్ లీజర్ రిటైల్‌తో క‌ల‌సి దుబాయి ఎయిర్‌పోర్ట్ ఈ వినూత్న సర్వీసును ప్రారంభించింది. ఎయిర్ పోర్ట్‌లో విమానం ఎక్క‌కముందే ప్ర‌యాణీకుల‌కు మ‌రింత అనుభూతిని, ఆనందాన్ని క‌లిగించేందుకు 25 శాతం డిస్కౌంట్‌తో రెస్టారెంట్‌లో భోజ‌న స‌దుపాయం, స్పాతోపాటు అదృష్టం వ‌రిస్తే ఉచితంగా మాల్దీవుల‌కు ఫ్యామిలీ ట్రిప్ కూడా పొందొచ్చు. ఇప్ప‌టికే ఎయిర్‌పోర్ట్‌లో వైఫై సేవ‌ల‌ను అందిస్తున్నామ‌నీ, మున్ముందు ప్ర‌యాణీకుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లను అందిస్తామ‌ని దుబాయి ఎయిర్‌పోర్ట్ డైరెక్ట‌ర్ మాథ్యూ హోరోబిన్ తెలిపారు. 

Loading...