12-men-died-

పోలీసు సహా 12 మంది మృతి

అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు
కాలిఫోర్నియా: అమెరికాలో మళ్లీ కాల్పులు జరిగాయి. లాస్‌ఏంజెలిస్‌ సమీపంలోని ఓ నైట్‌ క్లబ్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి సహా 12 మంది మరణించారు. థౌజెండ్‌ ఓక్స్‌ శివారులో ఉన్న బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లో గురువారం వందలాది మంది విద్యార్థులు వేడుక చేసుకుంటుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడినట్లు చెప్పారు. మొత్తం 30 రౌండ్ల మేర కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగుడు కూడా మరణించినట్లు తెలిపిన పోలీసులు.. అతనెలా చనిపోయాడన్న విషయాన్ని మాత్రం వివరించలేదు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 12 మంది మరణించినట్లు చెప్పారు.