10-Thousand-crores-investments-to-AP

ఏపీలో 10వేల కోట్ల పెట్టుబడులు!

ముందుకొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థలు

ఆహారశుద్ధి కర్మాగారాలకు ప్రాధాన్యం
అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన వ్యాపార దిగ్గజ సంస్థలు రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చాయి. ఆహార శుద్ధి కర్మాగారాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతామంటూ యూఏఈ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం(బీఎల్‌ఎఫ్‌) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం, ఇండియా ట్రేడ్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి(ఏపీఈడీబీ)తో రెండు ఒప్పందాలు చేసుకున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. రూ.10వేల కోట్ల దాకా పెట్టుబడులు పెడుతున్నట్లు బీఎల్‌ఎఫ్‌ అధ్యక్షుడు రామ్‌బక్సానీ ప్రకటించారు. విద్య, వైద్యరంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ ఒప్పందాలవల్ల ఆంధ్రప్రదేశ్‌తో సత్సంబంధాలు మెరుగుపడతాయని బక్సానీ వివరించారు.