:: Welcome to NRI - Article ::

ప్రజలు వేడి, ఉక్కపోతతో.. బాధలు పడుతున్నారని..

టెక్సాస్: ప్రజలు వేడి ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో నమోదైన ఉష్ణోగ్రతలు 90 నుంచి 95 డిగ్రీలుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ మొదటివారంలో అమెరికాలో సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ డిగ్రీల్లోనే నమోదవుతాయని అధికారులు చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాత్రం కాస్త ఎక్కువగానే నమోదయ్యాయని వారంటున్నారు.

ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని రోజంతా ఉక్కపోతతో వాతావరణం అసహనం పెంచేలా చేసిందని వారంటున్నారు. కెనడా తీరం నుంచి వేడిగాలులు వీస్తున్నాయని అధికారులు అంటున్నారు. అందువల్లే దేశంలో కొన్ని ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వారు తెలిపారు.