:: Welcome to NRI - Article ::

భర్త కళ్లముందే భార్యపై లైంగికదాడి

ఫ్లోరిడా: భార్యాభర్తలిద్దరూ జార్జియా నుంచి ఫ్లోరిడాకు వచ్చారు. అక్కడ హనీమూన్ జరుపుకోవాలని వారు ప్లాన్ చేసుకున్నారు. ఒకరోజు ముందే వారు షాపింగ్ ముంగించుకుందామని అనుకున్నారు. అనుకున్నట్లే షాపింగ్ చేద్దామని వెళ్లారు. వారిని గమనించిన ముగ్గురు వ్యక్తులు కూడా వారిని ఫాలో అయ్యారు. భార్యాభర్తలు ఫ్లోరిడాలోని హైలీత్‌లో ఉన్న పబ్లిక్స్ సూపర్‌మార్కెట్‌లో షాపింగ్ చేశారు. అక్కడ నుంచి నేరుగా వారు దిగిన హోటల్ మాంటెల్6కు బయలుదేరారు. పార్కింగ్ చేసిన కారును బయటకు తీసేందుకు భర్త వెళ్లాడు.

అక్కడే వేచి చూస్తున్న రాషాబా హోసర్లీ(32), తిమోతీలావే(33) అనే ఇద్దరు మరో వ్యక్తి మరో వ్యక్తి కూడా వారిని గమనిస్తున్నారు. 27 ఏళ్ల ఆ మహిళ భర్త కారు బయటకు తీసుకువచ్చి, ఆమె దగ్గర ఆపాడు. వెంటనే కారులో దూరిన ఆ ముగ్గురు భర్తను తుపాకీతో బెదిరించారు. అతడి కళ్లముందే ఆమెపై లైంగికదాడి చేశారు. అంతటితో వారు ఊరుకోలేదు. షాపింగ్ మాల్ పార్కింగ్ సెంటర్‌లో చీకటిగా ఉండటంతో అటువైపు ఎవ్వరూ రాకపోవడంతో వారు యథేచ్ఛగా ఆమెపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. అక్కడినుంచి వారు దిగిన హోటల్‌గదికి తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెపై లైంగికదాడి చేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. 

Loading...