women-kills-his-daughter

కూతురికి దెయ్యం పట్టిందని ఓ తల్లి చేసిన పనిది

ఓక్లహామా: కూతురికి దెయ్యం పట్టిందనే కారణంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన ఆమె ప్రవర్తన మరింత చర్చనీయాంశంగా మారింది. కూతురిని హత్య చేశాననే పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా కోర్టులో నవ్వుతూ కనిపించింది. చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన 51 ఏళ్ల జువానిత గొమెజ్ అనే మహిళ తన కూతురిని హత్య చేసింది. కూతురుకి దెయ్యం పట్టిందని భావించి శిలువ వేసింది. కూతురి గొంతు, ఛాతిపై తీవ్రమైన గాయాలు చేసింది. దీంతో కూతురు 33 ఏళ్ల జెనీవా ఇంట్లోనే చనిపోయింది. 2016లో నిందితురాలి ఇంట్లో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా ఇటీవలే కోర్టుకు హాజరైన నిందితురాలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించింది. కోర్టులో నవ్వుతూ కనిపించింది. దీంతో ఆమెను చూసిన వారు షాక్‌కు గురయ్యారు. ఇదిలావుండగా ఆమెకు జీవితకాల జైలుశిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. పెరోల్ కూడా ఇవ్వవొద్దని ఆదేశించారు. ఇదిలావుండగా నిందితురాలి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. కన్నకూతురిని హత్య చేయడం కాకుండా పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.