women-killed-her-father-

కన్నతండ్రి అని కనికరం కూడా లేకుండా..

కరోలినా: కన్నతండ్రి  అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు దారుణమైన పని చేసింది. తల్లి కళ్లముందే తండ్రిని చంపేసి, శవాన్ని నాలుగు రోజులపాటు ఇంట్లోనే దాచి పెట్టింది. ఆదివారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే తండ్రిని చంపేసిన తర్వాత ఆమె తన తల్లిని కూడా చంపేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. దాంతో తల్లి భయపడి ఇంట్లోనే ఓ గదిలో దాక్కుందన్నారు. గురువారం తల్లి ఇంట్లో నుంచి తప్పించుకుని తమకు సమాచారం అందించిందని పోలీసులు చెప్పారు. గోల్డెన్ గేట్ ఎస్టేట్‌లోని ఓ ఇంట్లో రాకీ(56) అనే వ్యక్తి తన భార్య, కూతురు రూక్వెల్ ప్రెజర్(32)తో కలిసి నివసిస్తున్నాడు.

అయితే ఆదివారం రాకీ ఇంట్లో నుంచి తుపాకీ పేలిన శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే ఏం జరిగిందో ఎవ్వరూ తెలుసుకోకపోవడంతో విషయం వెలుగు చూడలేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ప్రెజర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. అయితే ప్రెజర్‌ తన తండ్రిని చంపేందుకు గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.