:: Welcome to NRI - Article ::

పిల్లాడి చేతికి తుపాకీ ఇచ్చిందని.. ఆమెను అరెస్ట్ చేశారు

ఫ్లోరిడా: ఒక మహిళ, తన మూడేళ్లు కొడుకుతో ఆ ఇంట్లో నివసిస్తోంది. శుక్రవారం ఉదయం ఆ ఇంటికి పోలీసులు వచ్చారు. ఇల్లంతా సోదా చేయడం మొదలుపెట్టారు. రాసోలిన్ ఫెయిలిన్(34) అనే మహిళకు అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తన ఇంట్లోకి వచ్చి సోదాలు ఎందుకు చేస్తున్నారంటూ ఆమె వారిని ప్రశ్నించింది. రాసోలిన్, మత్తుమందులు సరఫరా చేస్తోందని తమకు ఫిర్యాదు అందిందని అందుకే సోదాలు జరుపుతున్నామని పోలీసులు ఆమెకు తెలిపారు. ఆ పని తాను చేయడం లేదని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు ఆమెకు, కొన్ని ఫోటోలు చూపించారు.

ఆ ఫోటోల్లో కనిపించిన వ్యక్తి ఎవరని ప్రశ్నించారు. అతడు తన ప్రియుడని తెలిపింది. అతడే మత్తుమందులు అమ్ముతాడని తనకు వాటితో సంబంధం లేదని తెలిపింది. పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగానే, రాసోలిన్, మూడేళ్ల కొడుకు తన బొమ్మల బాక్స్‌ నుంచి ఒక తుపాకీ తీసి పోలీసులపై గురిపెట్టాడు. అది నిజమైన తుపాకేనని పోలీసులు తెలిపారు. ఆ తుపాకీలో ఒక బుల్లెట్ కూడా ఉందని వారంటున్నారు. చిన్నపిల్లలకు తుపాకులు ఇచ్చి, ప్రమాదంలో పెడుతుందనే ఆరోపణలతో పోలీసులు రాసోలిన్‌ను అరెస్ట్ చేశారు. తమకు కావాల్సిన వ్యక్తి దొరకకపోయిన రాసోలిన్‌ను మాత్రం అరెస్ట్ చేయకతప్పలేదని పోలీసులు అంటున్నారు.    

Loading...