:: Welcome to NRI - Article ::

రోడ్డుపై మహిళ.. అంతా చూస్తుండగానే.. ఘోరం

ఫ్లోరిడా: రోడ్డుపై ఒక జీపు దూసుకుపోతోంది. అందులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. అతి వేగంగా వెళ్తున్న ఆ జీపును ఆపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆ జీపు డ్రైవర్ మాత్రం కొంచెం కూడా వేగం తగ్గించడం లేదు. బ్రిటానియా గాలి ఇవాన్స్(24) అనే మహిళ ఆ జీపులో ముందు సీట్లో కూర్చుని ఉంది. ఆ జీపు ఫ్లోరిడాకు ఉత్తరంగా ఉన్న జాక్సన్‌విల్లే పట్టణం వైపు వెళ్తోందని పోలీసులు తెలిపారు. ఆ జీపులో కూర్చున్న వ్యక్తులు ఎవరూ సీటుబెల్ట్ పెట్టుకోలేదని వారంటున్నారు.

తాము ఆ జీపు ఆపేందుకు ప్రయత్నించిన డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడని వారు తెలిపారు. అలా కొద్దిదూరం వెళ్లగానే, ఇవాన్స్ జీపులో నుంచి కిందపడిందని వారంటున్నారు. తాము వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అప్పుడు కూడా డ్రైవర్, జీపు ఆపలేదని వారు చెబుతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జీపు టైర్లను తుపాకీతో కాల్చామని, అందువల్ల  టైరు పేలి, జీపు ఆగిపోయిందని వారు తెలిపారు. ఇవాన్స్‌తోపాటు జీపులో ప్రయాణించిన వారెవరూ స్పృహలో లేరని పోలీసులు చెబుతున్నారు. అంతా మద్యం సేవించి ఉన్నారని వారంటున్నారు. అందువల్లే అంతా వేగంగా వెళ్తున్నారని వారంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఇవాన్స్ మరణించిందని పోలీసులు తెలిపారు.