:: Welcome to NRI - Article ::

యాక్సిడెంట్‌లో తల్లి మృతి.. అనాథలైన కవలపిల్లలు

కాలిఫోర్నియా: ఓ తల్లి తన కవలపిల్లలిద్దరి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చేర్పించింది. డాక్టర్లు వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచారు. ఏదో పని ఉండటంతో ఆమె ఆసుపత్రి బయటకు వచ్చింది. పిల్లలు ఒంటరిగా పడుకున్నారని చూడడానికి ఆమె త్వరగా పని ముగించుకుని ఆసుపత్రిలోకి వెళ్తోంది. అప్పుడే అటుగా ఒక కారు స్పీడుగా దూసుకొచ్చింది. అంత చూస్తుండగానే ఆమె తలపై నుంచి ఆ కారు వెళ్లిపోయింది. దాంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఆసుపత్రిలో నుంచి పిల్లలిద్దరి ఏడుపులు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులు కూడా ఎవ్వరూ ఆ సమయంలో ఆమె వెంట లేరని పోలీసులు తెలిపారు.

పాలు తాగే పసి పిల్లలు కావడంతో ఆకలితో వారు అలమటిస్తున్నారు. ఇంత హృదయవిదారకమైన సంఘటన కాలిఫోర్నియాలో శుక్రవారం జరిగింది. చనిపోయిన ఆమెను కాటీ ఎవాన్స్(37)గా పోలీసులు గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారమందించారు. కారు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ఒక మహిళ అని పోలీసులు చెప్పారు. ఆమె అప్పటికే మద్యం మత్తులో ఉందని వారు అన్నారు. కారులో మద్యం బాటిళ్లు కూడా దొరకాయని, ఆమెను అరెస్ట్ చేశామని త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని వారన్నారు.