:: Welcome to NRI - Article ::

కారులో మహిళ శవం.. ఏం జరిగిందంటే..

టెక్సాస్: పోలీసులను చూసి ఒక వ్యక్తి కారు ఆపకుండా వెళ్లిపోతున్నాడు. వెంటనే పోలీసులు అతడి కారును వెంబడించారు. అతడు మాత్రం వేగం తగ్గించడం లేదు. దాంతో అతడేదో నేరం చేసి ఉంటాడని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. రెండు గంటల చేజింగ్ తర్వాత అతడు పోలీసుల చేతికి దొరికాడు. కారు నడిపిన వ్యక్తిని డిక్వెలాన్ డెజాన్ హరీస్‌గా గుర్తించారు. అతడి కారు మొత్తం వెతకడం ప్రారంభించారు. అయితే అతడు మత్తు మందులు సరఫరా చేస్తున్నాడేమోనని మొదట అనుకున్న పోలీసులు కారులో అమ్మాయి శవం కనిపించడంతో కంగుతిన్నారు. ఆమెను సెడర్ హిల్ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు.

ఆమె తల్లిదండ్రులు జూలై 13న ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళశవం తన కారులోకి ఎలా వచ్చిందో తెలియలేదని హరీస్ చెబుతున్నాడు. తాను ఒక పాపను రైడ్ కోసం చేసుకుందామని ఒక ఇంటికి వెళ్లివస్తున్నానని చెప్పాడు. అయితే పోలీసులను తాను చూడలేదని తాను మామూలుగానే కారులో వెళ్తున్నానని చెప్పాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయిని ఎవరో హత్యచేసి ఉంటారో తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

Loading...