:: Welcome to NRI - Article ::

9 అడుగుల అనకొండను పట్టుకున్న మహిళ

ఫ్లోరిడా: లీయోన్ కంట్రీకి చెందిన స్థానికుడు తమ ప్రాంతంలో తిరుగుతున్న ఆనకొండను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే ఎటువంటి అనకొండనైన పట్టుకోగలిగే ఎమిలిషాను పిలిపించారు. ఆమె ఎంతో తెలివిగా ఆ అనకొండను పట్టుకుంది. అది ఎవరో పెంచుకుని వదిలేసిందని ఆమె తెలిపారు. దాని పొడవు 9 అడుగులని ఎమిలిషా చెప్పారు. ఎమిలిషా అనకొండను పట్టుకునేటప్పుడు వీడియో తీసి పోలీసులు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.