:: Welcome to NRI - Article ::

తనకు దెయ్యం పట్టిందని.. ఓ మహిళ ఏం చేసిందంటే

కాలిఫోర్నియా: ఒక మహిళ తన కన్నకూతురిపై దాడి చేస్తోంది. ఆమెను తీవ్రంగా కొడుతోంది. ఆ బాలిక అరుపులు విని పక్కింటి వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. ఆ మహిళను చూసి భయపడ్డాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం కింబ్లే ఫ్లెడర్(45), అనే మహిళకు దెయ్యం పట్టిందని అందరికీ చెబుతోందని అతడు తెలిపారు. అంతేకాకుండా  దెయ్యం పేరు అడ్డుపెట్టుకుని అందరినీ కొట్టేందుకు ప్రయత్నిస్తుందని అతడు అంటున్నాడు. కింబ్లే, పక్కింట్లో ఉంటున్న తాను రోజు ఈ బాధలు భరిస్తున్నానని చెప్పాడు. కింబ్లేకు 11 ఏళ్ల కూతురు ఉందని అతడు చెబుతున్నాడు. ఈ మధ్య తన కూతురికి కూడా దెయ్యం పట్టిందంటూ పాపను కూడా కొట్టడం మొదలుపెట్టిందన్నాడు.

అంతలో పాప అరుపులు విని, కింబ్లే, ఇంటికి వచ్చానని అతడు తెలిపాడు. అప్పటికే ఆమె తన కూతురిని బలమైన కర్రతో కొడుతోందని తెలిపాడు. తాను ఆపేందుకు ప్రయత్నించిన వినలేదని తెలిపాడు. దాంతో చేసేదేమిలేక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. పోలీసులు వచ్చేంతవరకు కూడా కింబ్లే తన కూతురిని కొడుతునే ఉందని అతడు అన్నాడు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కింబ్లే, తన కూతురికి దెయ్యం పట్టిందని పోలీసులకు తెలిపింది. చాలామంది ఇలాగే చేసి దెయ్యాన్ని వదిలిస్తారంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం అని వారితో చెప్పింది. దీన్ని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని వాదించింది.