:: Welcome to NRI - Article ::

పిల్లాడు ఆరుబయటే ఆడుకుంటున్నాడు.. తల్లి మాత్రం తన గదిలో..

ఓహియో: మారిన్ డ్రైవ్‌ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను ఆరు బయటే వదిలేసింది. ఆమె మాత్రం ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చుంది. అది గమనించిన పక్కింటి మహిళ తలుపులు తెరవమని ఆమెను ఎన్నిసార్లు కోరినా ఆమె తెరవకపోవడం వల్ల పోలీసులకు ఫోన్ చేసింది. ఆమె పెద్దకొడుకు(6) స్కూల్‌కు వెళ్లాడని మళ్లీ ఆ బాబు సాయంత్రం గం.3-45 నిమిషాలకు తిరిగివస్తాడు. అయితే ఆమె చిన్నకొడుకు(2) ఆరు బయట చచ్చిన ఎలుకతో ఆడుకుంటూ కనిపించడం వల్ల తాను కంగారుపడ్డానని ఆమెకేదో జరిగి ఉంటుందని ఊహించి పోలీసులకు ఫోన్ చేశానని చెప్పింది.

పోలీసులు ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె తలుపులు మాత్రం తెరవలేదు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి, లోపలికి వెళ్లారు. అప్పటికీ ఆమె బెడ్‌రూమ్‌లో నిద్రపోతోంది. ఆమె పసిపిల్లవాడిని ప్రమాదంలో పెట్టేవిధంగా ప్రవర్తించిందనే నేరం మీద పోలీసులు హర్ట్‌మాన్(42)ను అరెస్ట్ చేశారు. ఇద్దరు పిల్లలను మహోనింగ్ కంట్రీ చిల్డ్రన్ సర్వీసు సెంటర్‌లో చేర్పించారు. ఇంటి బయట ఇంత జరుగుతున్నా హర్ట్‌మాన్ నిద్రలేవకపోవడం పోలీసులకు కూడా అనుమానం కలిగించింది.  

Loading...