women-arrested

పక్కింటి పెంపుడుకుక్కను దొంగిలించి..

ఫ్లోరిడా: ఓ ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు పోలీసులకు ఆశ్చర్యం కలిగించాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇద్దరు మహిళలు ఆ ఇంటి పెంపుడు కుక్కను దొంగిలించారు. పెంపుడు కుక్కను దొంగిలించాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు ఆరా తీశారు. క్రూజర్(51), జెన్నిఫర్(53) అనే ఇద్దరు మహిళలు తమ పక్కింట్లో ఉన్న పెంపుడు కుక్కను చూసి పెంచుకోవాలనుకున్నారు. అచ్చం అలాంటి కుక్కపిల్లనే తెప్పించుకుని పెంచుకోవాలని ముందు అనుకున్నారు. కానీ, అలాంటి కుక్కపిల్ల దొరకలేదు. దాంతో పక్కింట్లో ఉన్న పెంపుడు కుక్కను దొంగిలించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్లాన్ వేసుకున్నారు. అర్ధరాత్రి పక్కింట్లో దూరి పెంపుడు కుక్కపిల్లను దొంగతనం చేశారు. ఆ తరువాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించిన ఇంటి యజమాని తన పెంపుడు కుక్కను దొంగిలించారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు చివరికి క్రూజర్, జెన్నిఫర్‌లను మియామిలో అదుపులోకి తీసుకున్నారు.