women-arrested-

ఓ తల్లి నిర్లక్ష్యం కారణంగా.. ఏం జరిగిందంటే..

ఓర్లాండో: పార్క్ చేసిన కారులో ఘోరం జరిగింది. వరుసగా కొద్ది గంటల వ్యవధిలోనే రెండు చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఎలైట్ ప్రాపర్టీ అకాడమి దగ్గరలో ఓ పార్క్ చేసిన కారులో నాలుగు సంవత్సరాల వయసున్న బాబు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బందితో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. బాబును కారులో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే బాబు చనిపోయాడు. తల్లి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె కొడుకును ఒంటరిగా కారులో వదిలేసి వెళ్లడం వల్లే బాబు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. మరో చోట కూడా ఇదే తరహ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.