women-accidentally-slipped-into-sea--

అర్ధరాత్రి .. బోటుపై నుంచి సముద్రంలో దూకేసిన మహిళ..

ఫ్లోరిడా: అర్ధరాత్రి ఓ మహిళ షిప్‌లో నుంచి సముద్రంలో పడిపోయింది. అయితే ఆమె ఆ సమయంలో షిప్‌పై భాగం మీద నిలుచుని ఉందని కెప్టెన్ చెప్పాడు. ఆమె రాత్రి అక్కడ ఎందుకు నిల్చుని ఉందో మాత్రం ఎవ్వరికీ అంతుపట్టలేదు. కొద్దిసేపటికే ఆమె సముద్రంలో దూకేసిందని కుక్ చెప్పాడు. చాలాసేపటి నుంచి ఆమెను గమనించిన అతడు ప్రమాదాన్ని ముందే పసిగట్టాడని కెప్టెన్ కెన్నెడీ చెప్పారు. కొంతమంది ప్రయాణికులతో విహరయాత్రకు బయలుదేరామని ఆయన చెప్పారు. అయితే ఆకస్మాత్తుగా ఇలాంటి దుర్ఘటన జరగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే ఆ మహిళ సముద్రంలో దూకిన వెంటనే రెస్క్యూ బోటులు ఉపయోగించి గాలింపు చర్యలు మొదలుపెట్టామని కెన్నెడి చెప్పారు. రాత్రి సమయంలో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టడం నిజంగా కష్టమైన పని అని కెన్నెడీ చెప్పారు. చివరికి ఆమె ఆచూకీ లభించిందని వెంటనే ఆమెను రెస్క్యూ బోటులో ఎక్కించి ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని కెన్నెడి చెప్పారు.