:: Welcome to NRI - Article ::

ఇద్దరితో సెక్స్..ఒకరు నిరాసక్తి చూపడంతో యువతి చర్య ఇది

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచార ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓ యువతి తీరు చర్చనీయాంశంగా మారింది. అత్యాచారానికి సంబంధించిన అనేక కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు, విచారణ జరిపిన న్యాయమూర్తులను ఓ మహిళ కంగుతినేలా చేస్తోంది. పూర్తివివరాలలోకి వెళ్తే.. అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన నిక్కీ యోవినో అనే 19 ఏళ్ల యువతి ఓ ఊహించని పరిస్థితికి కారణమైంది. నగరంలోని ఓ కాలేజీకి చెందిన ఇద్దరు ఫుట్‌బాల్ ఆటగాళ్లు తనను రేప్ చేశారని కేసుపెట్టింది. కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కంగుతినే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్ కేసు పెట్టిన యువతి.. నిందితులుగా పేర్కొంటున్న ఇద్దరు వ్యక్తులతో సమ్మతం మేరకే సెక్సులో పాల్గొందని తేలింది. యువకులతో సంబంధం కొనసాగుతుండగా ఇద్దరిలో ఒకరు సెక్సులో పాల్గొనడానికి నిరాసక్తి చూపించారు. ఆగ్రహం చెందిన యువతి తనతో సెక్సులో పాల్గొనాలని, లేకపోతే రేప్ కేసుపెడతానని బెదిరించింది. అయినా యువకులు పట్టించుకోకపోవడంతో కేసుపెట్టిందని స్పష్టమైంది. విచారణలో ఈ విషయాలు బయటపడడం, ఎందుకిలా చేశావని ప్రశ్నించడంతో మరో నాటకానికి తెరలేపింది. తనకు మతిస్థిమితం లేదని, అందుకే కేసు పెట్టానని న్యాయమూర్తికి చెప్పింది. దీంతో కంగుతిన్న న్యాయమూర్తి యువతికి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వైద్యనివేదిక అందిన తర్వాత కేసుపై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఇదిలావుండగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు తాము ఎలాంటి తప్పూ చేయలేదని, కేసుపెట్టిన యువతి ఇష్టపూర్వకంగానే తమతో ఆమె సెక్సులో పాల్గొందని యువకులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 

 

Loading...