wildfires-in-northern-California-

అంతటా అవే పరిస్థితులున్నాయని..

ఉత్తరకాలిఫోర్నియా: ఎటూ చూసిన అగ్నిజ్వలాలు కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియా అడవిలో రగిలిన కార్చిచ్చు మండుతూనే ఉంది. దాంతో జంతువులు, మనుషులు అనే తేడా లేకుండా అన్ని జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. అడవిలో సంభవించిన అగ్నిప్రమాదం వల్ల ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు చనిపోయారన్నారు. ఇరవై వేల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిన అటవీ ప్రాంతం సుమారు 29వేల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని వారు చెబుతున్నారు.

ఈ విస్తీర్ణం సగం లాస్‌ఎంజీల్స్‌కు సమానమన్నారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చాలా చోట్ల మంటలు చల్లారినప్పటికీ మనుషులు అక్కడ అడుగుపెట్టే అవకాశం లేదన్నారు. మంటలు వ్యాపిస్తున్న ప్రదేశాల్లో మాత్రం ఆకాశం ఎర్ర రంగులో కనిపిస్తోందన్నారు. రాత్రి పూట అయితే చాలా దూరం వరకు ఆకాశం ఎర్రగా కనబడుతోందని అధికారులు తెలిపారు.