wildfire-smoke-makes-for-hazy-skies

అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి కావడంతో..

ఉత్తరకాలిఫోర్నియా: వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతయింది. దాంతో కొన్ని కిలోమీటర్ల వరకు పొగ వ్యాపించింది. పొగ వల్ల ఆకాశం రంగు మార్చుకుందా అన్నట్లుగా కనపడుతోందని స్థానికులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పొగ కూడా అదే మాదిరిగా గాలిలో కలిసిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా అటవీ ప్రాంతానికి చుట్టూ పక్కల నివసిస్తున్న వేల మంది ప్రజలతో అధికారులు ఇళ్లు ఖాళీ చేయించారు..

 అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి కావడం వల్ల వారిని సురక్షిత వేలాది జంతువులు చనిపోయాయి. అలాగే కొన్ని కిలోమీటర్ల మేర వేడి వ్యాపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ఇప్పటికే చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ఆచూకీ కూడా లభించడం లేదంటున్నారు. అయితే గాలిలో పొగ ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు ఎమర్జెన్సీ విధిస్తామని అధికారులు తెలిపారు.