wild-fish-attacked-a-man-

మనిషిపై చేప దాడి చేసిందని...

జార్జియా: ఓ వ్యక్తి తన 30వ పెళ్లిరోజును ఎంతో ఘనంగా జరుపుకోవాలనుకున్నాడు. తన కుటుంబసభ్యులతో కలిసి ఫ్లోరిడాలోని కోరల్ రీఫ్ పార్క్‌కు వెళ్లాడు. సముద్ర తీరంలో కొద్దిసేపు కుటుంబసభ్యులతో కలిసి సరదాగా ఈత కొట్టాడు. ఒడ్డుకు చేరుకున్న కొద్దిసేపటికే అతడు కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు.

వారు అక్కడికి చేరుకుని అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. షార్క్ చేప జాతికి చెందిన (బారాకుడా) అనే చేప అతడిపై దాడి చేసిందని వారు తెలిపారు.