wife-attacked-on-husband

భర్తపై కోపంతో ఏం చేసిందంటే..

ఫ్లోరిడా, యూఎస్ఏ: దంపతుల మధ్య తలెత్తిన వివాదం తీవ్రమైన ఘర్షణకు దారి తీసింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇస్మేరల్డా లోపెజ్ అనే 41 ఏళ్ల మహిళ తన భర్తతో ఘర్షణకు దిగింది. ఇంట్లోనే ఇద్దరూ గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లోపెజ్.. ఇంట్లోని వేడి వేడి సాస్‌ను తీసుకొచ్చి భర్త ముఖంపై పోసింది. దీంతో బాధిత భర్త తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయని, కళ్లపై అధిక ప్రభావం ఉందని పాస్కో కౌంటీ షెరీష్ అధికారులు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేశామని, విచారణ జరగనుందని పోలీసులు వెల్లడించారు. బాధితుడి పేరు, వివరాలను వెల్లడించలేదు.