viral-video-

ఎవ్వరి కంటపడని జీవి.. వీడియో వైరల్ కావడంతో..

టెక్సాస్: ఎవ్వరి కంటపడని ఓ వింత జీవిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. టెక్సాస్ రాష్ట్రంలోని హట్సాన్ నగరంలో ఈ వింత చోటు చేసుకుంది. అయితే వీడియో చూసిన కొంతమంది శాస్త్రవేత్తలు ఆ జీవి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అది జీవి కాదని అనేక వేల జీవుల సమూహం అని వారు పేర్కొన్నారు. 'ట్యూబిఫెక్స్ వామ్స్' అని పిలిచే జీవులు సమూహంగా ఏర్పడతాయని వాటి సమూహం చివరికి ఓ రూపం దాల్చుకుని ఇలా కనపడుతుందని వారు తెలిపారు. అయితే 2009లో మొదటిసారి ఆ జీవిని కొంతమంది చూశారని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు. అప్పట్లో అదో సంచలనం అయిందన్నారు. ఆ విషయం పెద్దగా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో అలాంటి జీవి ఉందన్న విషయం తెలియకుండాపోయిందని వారు తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి జీవి మనుషుల కంటపడిందని వారు తెలిపారు.