variety-thieves-

'బ్రా'లు దొంగలెత్తుకెళ్లారు.. వాటి విలువెంతో తెలుసా?

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో వెరైటీ దొంగతనం కేసులో ఇద్దరు యువతులు అరెస్ట్ అయ్యారు. వాళ్లు ఓ గార్మెంట్ షాపులోకి దూరి.. నిండు బ్యాగులతో బయటపడటానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన అక్కడి మహిళా సిబ్బంది ఒకరు.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. వెంటనే ఆమె కళ్లలోకి పెప్పర్ స్ప్రే కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. సిబ్బంది చెప్పిన గుర్తులను బట్టి.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో సెర్చ్ చేస్తే.. అసలు విషయం బయటపడింది. సంచుల నిండా స్త్రీల లోదుస్తులు ఉన్నాయి. అన్నీ బ్రాలే ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. వాటి ఖరీదు లెక్కగడితే.. రూ. 7 లక్షలని తేలింది.

 
ఇది కాలిఫోర్నియాలోని విక్టోరియా సీక్రెట్ మాల్‌లో జరిగింది. క్వింటెరో, వెల్చ్ ఇద్దరూ స్నేహితులు. గత శుక్రవారం ఇద్దరూ విక్టోరియా సీక్రెట్‌లో షాపింగ్‌కి వెళ్లారు. అక్కడే తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.