Use-Bats-to-Reduce-Mosquitoes

గబ్బిలాలతోనే దోమల జనాభా తగ్గుతుందని..

ఫ్లోరిడా: దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల వల్ల ఇప్పటికే కొంతమంది వ్యాధులతో ఆసుపత్రుల పాలయ్యారని ఆరెంజ్ కంట్రీ హెల్త్ కమిషనర్ ఇమ్మిల్లా బోన్ తెలిపారు. దోమల జనాభాను అరికట్టాలంటే గబ్బిలాలను పెంచాలని ఆమె సూచిస్తున్నారు. స్థానికులు తమ ఇళ్ల వద్ద గబ్బిలాలు నివసించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ఎందుకంటే గబ్బిలాలు ఒక్క గంటలోనే కొన్ని వేల దోమలను తినేస్తాయని ఇమ్మిల్లా చెబుతున్నారు. అదే సమయంలో గబ్బిలాల వల్ల రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.

అయితే రేబిస్ వ్యాప్తి కన్నా వేగంగా దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అందువల్ల దోమల జనాభా అరికట్టేందుకు గబ్బిలాల రంగంలోకి దించడమే ఉత్తమైన మార్గమని ఆమె అభిప్రాయపడుతున్నారు. అయితే దోమల కన్నా గబ్బిలాలతోనే తమకు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.