US-Air-Force-fighter-jet-intercepts-two-Russian-bombers

రష్యా బాంబర్లను కూల్చివేసిన అమెరికా

అలాస్కా, యూఎస్ఏ:అలాస్కాకు సమీపంలో రష్యాకు చెందిన రెండు బాంబర్లను యూఎస్ ఎయిర్‌ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. టీయూ-95 అనే బాంబర్లను మంగళవారం గుర్తించిన ఎయిర్‌ఫోర్స్ దళాలు రాత్రి 10 గంటల సమయంలో కూల్చివేశాయని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్(ఎన్ఓఆర్ఏడీ) ప్రకటించింది. గగనతలంలోకి ప్రవేశించి తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడంతోనే బాంబర్లను కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. అమెరికా, కెనడా గగనతలంలో ఈ బాంబర్లు ప్రయాణించాయని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న మొదటి బాంబర్‌ను కూల్చివేశామని వెల్లడించారు. ఎఫ్-22 ఫైటర్ జెట్స్ సహాయంతో ఈ బాంబర్‌ను కూల్చివేశామని ప్రకటించారు.